
టీకా ఉత్సవాలు జరిపారు కానీ ప్రజలకు టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయలేదని కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ వాద్రా మండిపడ్డారు. దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దశలో ఏప్రిల్ 11 నుంచి 14 వరుకు టీకా ఉత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ఇచ్చిన ట్వీట్ లో వ్యాక్సిన్ల తయారీ లో భారత దేశం అతి పెద్ద దేశమని పేర్కొన్నారు. ఏప్రిల్ 12 న కేంద్ర ప్రభుత్వం టీకా ఉత్సవాలను నిర్వహించిందన్నారు. అయితే వ్యాక్సిన్లను ప్రజలకు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు.