
కొవిడ్-19 నుంచి వ్యాక్సిన్లు వందశాతం రక్షణ కల్పించ లేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. అయితే తీవ్రతను తగ్గిస్తాయని అన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కలు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు యాంటీబాడీ టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తొలి డోసు ఒక సంస్థది, రెండో డోసు ఇంకో సంస్థది తీసుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వేర్వేరు కంపెనీ డోసులు తీసుకున్నా ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని తెలిపారు. ప్రస్తుత ప్రొటోకాల్స్ ప్రకారం రెండు డోసులు ఒకే కంపెనీవి ఇవ్వాలని సూచించారు.