
నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి వ్యాక్సిన్ అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకు మొదలయ్యాయి. కేంద్రం నుంచి అవసరానికి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవడటంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవడం వల్ల తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.