
కరోనా టీకా ధ్రువపత్రాలు ఇకపై క్షణాల్లో వాట్సప్ ద్వారా అందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. కాంటాక్టు నంబరు (91 90131 51515) సేవ్ చేసుకొని, కొవిడ్ సర్టిఫికెట్ అనే సందేశం వాట్సప్ లో పంపాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి, క్షణాల్లో ధ్రువపత్రాలు పొందవచ్చు అని మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.