
సెప్టెంబర్ 5వ తేదీలోపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాల టీచర్లకు టీకాలు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కోరారు. ఇందు కోసం రాష్ట్రాలకు అదనంగా రెండు కోట్ల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. టీకాల కార్యక్రమంలో వారికి ప్రాధాన్యమిచ్చి టీచర్స్ డే కంటే ముందే లక్ష్యాన్ని పూర్త చేయాలన్నారు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి మరిన్ని డోసులు అందుబాటులో ఉంచేందుకు అదనంగా 2 కోట్ల టీకాలను తీసుకొచ్చాం. సెప్టెబర్ 5వ తేదీనాటికి టీచర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నాను అని ఆయన ట్వీట్ చేశారు.