
కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్టీకేలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహనిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.