Delta Force : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన మేరకు ఆ దేశ ప్రమాదకరమైన కమాండోల బృందం డెల్టా ఫోర్స్ (delta force) వెనిజుల అధ్యక్షుడు మదురో ను అరెస్టు చేసింది. అతడిని ప్రత్యేకమైన హెలికాప్టర్లో అమెరికా తీసుకెళ్లింది. డెల్టా ఫోర్స్ చేపట్టిన ఈ ఆపరేషన్ యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. డెల్టా ఫోర్స్ వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కమాండోల బృందం అమెరికాకు ఆయువుపట్టు. వెనిజులాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను చేపట్టింది.
చాలా గోప్యంగా..
డెల్టా ఫోర్స్ చేపట్టే ఆపరేషన్లు అత్యంత రహస్యంగా ఉంటాయి. అయితే ఈ ఆపరేషన్లు చేసిన తర్వాత చాలా రోజులకు అమెరికా ఏదో ఒక సందర్భంలో బయట పెడుతూ ఉంటుంది.
2001లో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్ కోసం అమెరికా వేట సాగిస్తోంది. ఆ సమయంలో బాగ్దాద్ పై డెల్టా ఫోర్స్ వైమానిక దాడి చేసింది. ఇరాక్ లో ఉన్న బందీలను విడిపించింది.
2019లో ఐసీసీ ఉగ్రవాద నాయకుడు అబు బాకర్ ఆల్ బగ్దాదిని పట్టుకోడానికి డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగింది. అతడు ఉన్న ప్రాంగణంలోకి చేరుకుంది.. దీంతో అతడు తుపాకీతో పేల్చేసుకున్నాడు.
పనామా ఆక్రమణలో డెల్టా ఫోర్స్ కీలకపాత్ర పోషించింది. ఆ దేశ సైనిక పాలకుడు నోరిగాను నిర్బంధంలోకి తీసుకుంది. 1990 జనవరి 3న ఈ సంఘటన జరిగింది.
సోమాలియా ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్న సాయుధ ముఠా నాయకుల పై 1993లో డెల్టా ఫోర్స్ దాడులు చేసింది…
సెప్టెంబర్ 11 తర్వాత అమెరికా ఉగ్రవాదులపై ప్రత్యక్షమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లు చేపట్టింది. వీటి వెనక డెల్టా ఫోర్స్ ఉంది.
డెల్టా ఫోర్స్ చేపట్టిన అన్ని ఆపరేషన్లు విజయవంత కాలేదు. కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ డెల్టా ఫోర్స్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కఠినమైన ఆపరేషన్లను చేపట్టింది.
1979లో ఇరాన్ ప్రాంతంలో అమెరికా రాయబార కార్యాలయంలో 53 మంది దౌత్య వేత్తలు బంధీ అయ్యారు. వారిని విడిపించడానికి డెల్టా ఫోర్స్ కఠినమైన ఆపరేషన్ చేపట్టింది. నాడు వైమానిక వ్యవస్థను నిర్వహించే ఆపరేటర్ తప్పిదాలు చేశాడు. దీంతో ఎనిమిది మంది అమెరికా సైనికులు చనిపోయారు. దీనిని ఒక గుణపాఠంగా భావించిన డెల్టా ఫోర్స్ ప్రత్యేకమైన ఆపరేషన్లకు అవసరమైన వైమానిక తోడ్పాటును అందించుకోవడానికి ప్రత్యేకంగా 160 స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్ ను ఏర్పాటు చేసుకుంది.
అమెరికా ప్రయోజనాల విషయంలో డెల్టా ఫోర్స్ ఏమాత్రం రాజీపడదు. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న వారందరిని నేలమట్టం చేయడంలో.. చూస్తుండగానే అంతం చేయడంలో డెల్టా ఫోర్స్ కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. నింగి, నేల, నీరు, అగ్ని, వాయువు.. ఇలా అన్ని చోట్లా డెల్టా ఫోర్స్ ఆపరేషన్లు చేపడుతూ ఉంటుంది. వీర మరణం కంటే విజయానికే డెల్టా ఫోర్స్ కమాండోలు ప్రాధాన్యం ఇస్తారు. దీనిని బట్టి వారు ఎటువంటి కఠినమైన ఆపరేషన్లు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. డెల్టా ఫోర్స్ సాహసాల నేపథ్యంలో ఇండియాకు కూడా ఇటువంటి ఒక బలమైన సైన్యం కావాలని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మన దేశానికి చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి.