
ఢిల్లీలో పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం మే 31 నుంచి దశల వారీగా ఆంక్షలను సడలించే ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా మే 31 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గత 24 గంటల్లో ఢిల్లీలో 1600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. లాక్ డౌన్ విషయంలో చాలా మందిని సంప్రదించామని, వారందరూ మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగించాలని సూచించారని ఆయన పేర్కొన్నారు.