అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. గత ఏడాది విడుదలైన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ మూవీ. బన్నీ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా సక్సెస్ లో పాటలదే మెజారిటీ షేర్ అంటే అతిశయోక్తి కాదు.
మూవీ రిలీజ్ కు కొన్ని మాసాల ముందే విడుదలైన పాటలు.. శ్రోతలను మైమరపించాయి. ఈ చిత్రంలోని ప్రతీపాటా అమోఘం అన్నట్టుగా ఆకట్టుకుంది. ఆడియోలోనే కాకుండా.. థియేటర్లలో కూడా ఈ సాంగ్స్ ను ఆడియన్స్ ఫుల్లుగా ఏంజాయ్ చేశారు. కేవలం ఈ సాంగ్స్ కోసమే మళ్లీ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.
అయితే.. ఈ సినిమాలోని పాటల్లో.. అర్మాన్ మాలిక్ ఆలపించిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతగా అలరించింది ఈ పాట. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిలోనూ హుషారెత్తించిన ఈ పాట.. ఇప్పటికీ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చూస్తూ ముందుకు సాగుతుండడం విశేషం.
ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబల్ లో 615 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో మరే పాట కూడా ఈ మార్కును చేరుకోలేదు. ఆ విధంగా టాలీవుడ్ లో టాప్ వన్ సాంగ్ గా నిలిచిన బుట్టబొమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో టాప్-5లో నిలిచింది.
ఇక, వ్యూస్ లో మాత్రమే కాదు.. లైక్స్ విషయంలోనూ ఇంతే. ఇప్పటి వరకు ఈ పాటకు ఏకంగా 4 మిలియన్స్ లైకులు దక్కాయి. తెలుగు ఇప్పటి వరకు ఏ పాటకూ ఇంత పెద్దమొత్తంలో లైక్స్ రాలేదు. సౌత్ లో చూస్తే.. సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇండియా వైడ్ గా.. లైకుల విషయంలో టాప్ 8 సాంగ్ గా నిలిచింది. ఈ విధంగా.. సినిమా విడుదలై ఏడాది గడిచిన తర్వాత కూడా ప్రభంజనం కొనసాగిస్తూ.. సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది బుట్టబొమ్మ సాంగ్.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Butta bomma creats another record
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com