
భారత్ కు చెందిన మరో ప్రాచీన పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. గుజరాత్ లోని ధోలవిరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇటీవలే తెలంగాణలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.