
హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సాహెబ్ నగర్ లో డ్రైనేజీ క్లీనింగ్ కు దిగి ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. అంతయ్య, శివ అనే కార్మికులు డ్రైనేజీ శుభ్రం చేసేందుకు మ్యాన్ హోల్ లోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్ హోల్ నుంచి ఒకరి మృతదేహాన్ని బయటికి తీశారు. మరో కార్మికుడి కోసం గాలింపు చేపడుతున్నారు.