
తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపడీడనంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల మీదుగా కొసాగుతుందని పేర్కొంది.