
విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం ఎం. వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. చంపావతినది కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దాంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు.