
తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసింది టీటీడి. సాధారణ భక్తులకు గదుల కేటాయిపంపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీఎస్ సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తంభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పారు. ఇక ఈ కేంద్రాలను శనివారం టీటీడీ ఈవో ధర్మరెడ్డి ప్రాంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా సులువుగా అద్దె గదులు పొందవచ్చన్నారు.