
ఐటీఐ చదివిన వారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు రాసే ఎల్ పీ సెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించి రేపటి నుంచి ఈనెల 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 100 ఆలస్య రుసుముతో ఈ నెల 23 వరకు దరఖాస్తును స్వీకరిస్తారు. ఎల్ పీ సెట్ కు సంబంధించి పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని రాష్ట్ర సాంకేతిక మండలి కమిషనర్ నవీన్ మిత్తత్ తెలిపారు.