
ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కె. ఆర్. పురం పీహెచ్ సీలో ఆక్సిజన్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుబాటులో లేని ప్రాంతాల్లో బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు.