
దేవరయాంజల్ భూముల్లో స్థానికులను ఖాళీ చేయించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ పి. కిషన్ రెడ్డి అనే స్థానికుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షెడ్లు కూల్చేస్తామని, ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీని పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి ప్రభుత్వం వివరణ ఇస్తూ విచారణ జరుపుతున్నామని, ఖాళీ చేయించడం లేదని తెలిపింది.