
తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నేడు నడవాల్సిన పూరి ఓఖా ఎక్సప్రెస్, 17న నడిచే రాజ్ కోట్- సికింద్రాబాద్, సికింద్రాబాద్-రాజ్ కోట్ ఎక్సప్రెస్ లు, 18న నడిచే పోరుబందర్- సికింద్రాబాద్, 19న బయలుదేరే ఓఖా- పూరి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్-పోరుబందర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న నడవాల్సిన ఓఖా- రామేశ్వరం రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.