పాకిస్థాన్ లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి- దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్సెప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైలును మిల్లట్ ఎక్సె ప్రెస్ ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన 29 గంటల తర్వాత రైల్వే ట్రాక్ ను మళ్లీ పునరుద్దించారు.