Donald Trump: భారత్ లో వాణిజ్య ఒప్పందం కుదిరే సమయం దగ్గరలోనే ఉదని ట్రంప్ అన్నారు. న్యూదిల్లీ పై ట్రంప్ దాదాపు 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో టారిఫ్ చర్చలు గొప్పగా జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు.