TDP Changes opinion on Kolikapudi : అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. గత ఎన్నికల్లో అనూహ్యంగా తిరువూరు టీడీపీ టిక్కెట్ దక్కించుకున్నారు. అదే స్థాయిలో విజయబావుట ఎగురవేశారు. అయితే అంతే వేగంగా వివాదాలు తెచ్చుకున్నారు. తిరువూరు టీడీపీలో చాలామంది నేతలు కొలికపూడితో విభేదించారు. దీంతో వివాదాలు జరిగాయి. దీంతో పార్టీ హైకమాండ్ కొలికపూడిపై కన్నెర్రజేసింది. రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కొలికపూడి విషయంలో వివాదాలు ఆగలేదు. దీంతో కొలికపూడిని దాదాపు పక్కనపెట్టారని ప్రచారం ప్రారంభం అయ్యింది. ఇటువంటి సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబెట్ లలో ప్రత్యక్షమయ్యారు కొలికపూడి. గత కొద్దిరోజులుగా డిబేట్లలో పాల్గొంటున్నారు. దీంతో టీడీపీ నాయకత్వానికి కొలికపూడి తిరిగి దగ్గరైనట్టు అర్థమవుతోంది.
Also Read : వాళ్లను నమ్ముకున్న జగన్.. కీలక బాధ్యతలు
అమరావతి ఉద్యమంలో కీలకంగా..
వాస్తవానికి అమరావతి ఉద్యమంలో కొలికపూడి శ్రీనివాసరావుది కీలక పాత్ర. హైదరాబాద్ లో గ్రూప్స్ ప్రిపరేషన్ ఇచ్చే ఇనిస్ట్యూట్ లను నడిపే శ్రీనివాసరావు విద్యాధికుడు. మంచి ఫాలోయింగ్ ఆయనకు ఉంది. నిజాయితీపరుడు అన్న పేరు కూడా ఉంది. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని విషయంలో అన్యాయం జరుగుతుండడంతో ఆ ప్రాంతానికి చెందిన కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ గా రియాక్టయ్యారు. హైదరాబాద్ నుంచి విద్యాధికులను కదిలించి అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. రైతులను సంఘటితం చేయడంలో ముందుండేవారు. తరచూ టీవీ డిబేట్లలో పాల్గొనేవారు. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కనిపించేవారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించేవారు. అందుకే చంద్రబాబు పిలిచి తిరువూరు టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచారు.
ఏబీఎన్ డిబేట్లకు హాజరు..
అయితే సీన్ కట్ చేస్తే తిరువూరులో కొద్దిరోజుల్లోనే వరుసగా ఎమ్మెల్యే కొలికపూడి వివాదాల్లో చిక్కుకున్నారు. దాదాపు పార్టీ కొలికపూడిని పక్కన పెట్టిందన్న ప్రచారం జరిగింది. అయితే ఏ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ డిబేట్ లలో పాల్గొన్నారో.. అదే ఏబీఎన్ కొలికపూడికి వ్యతిరేకంగా కథనాలు రాసింది. వార్తలను వండ వార్చింది. దీంతో వివాదాలు మరింత ముదిరాయి. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా కొలికపూడి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లలో కనిపిస్తున్నారు. దీంతో టీడీపీ నాయకత్వం కొలికపూడి విషయంలో వెనక్కి తగ్గినట్టేనని అర్థమవుతోంది. మరి ఏం జరిగిందో చూడాలి.