Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదృష్టం అనుకోకుండా వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అన్ని కలిసి వస్తాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. డబ్బు వివాహంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారిలో కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల తో కలిసి సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అండదండలతో కొత్త పెట్టుబడులు పెడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి నుంచి బయట పడేందుకు స్నేహితుల సహాయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఎదుటివారిని మాటలతో ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. ఉద్యోగులకు ఆదాయ వనరులను పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టినప్పుడు ఇతరుల అండదండలు ఉంటాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటారు. వీరికి గురువుల మద్దతు ఉండడంతో రాణిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈరోజు అన్ని కలిసి రావడంతో అధిక లాభాలు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయము అందుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికావడానికి కష్టపడాల్సి వస్తుంది. అయితే అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోకుండా విదేశాలకు ప్రయాణాలు చేస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడంతో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త భాగస్వాములు చేరడంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతికూలమైన వార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. శని దేవుడు అండదండలు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కుటుంబ సభ్యుల అందా దండలు ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. దానధర్మాలు ఎక్కువగా చేయడం వల్ల ప్రజల్లో గుర్తింపు వస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.