
అసోంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోమారు గెలిచిన సంగతి తెలిసిందే. కాగా హిమంత బిశ్వశర్మను అసోం ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. నేడు అసోం సీఎంగా హిమంత బిస్వా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గుహవాటిలోని పంజాబరి ప్రాంతంలోని శ్రీమంత శంకర్ దేవ్ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కాగా హిమంత బిస్వా శర్మ జలుక్ బరి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు.