
తిరుమలలో భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ఏజెన్సీకి అప్పగించారు. వీటితో పాటు వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్టాట్ టోకెన్ల జారీని సైతం అప్పగించారు. నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రైవేటు సంస్థకు అప్పగించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.