
మాజీ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ లో చేరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ను తెలంగాణలో రాజకీయంగా కనుమరుగు చేస్తామన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.