
అమెరికాకు చెందిన టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారత ప్రధాన మంత్రి మోది చోటు సంపాదించుకున్నారు. జాబితాలోని వందమందిలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖెరానా కూడ ఉన్నారు. అలాగే చైనా అధినేత జి జిన్‌పింగ్ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిచిన జో బిడెన్, కమలాదేవి హారిస్‌తో పాటు యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి పెలోసి నిలిచారు.