MP Raghunandan Rao: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కు పీపుల్స్ వార్ మావోయిస్టుపేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్ కాల్ ను రఘునందన్ పీఏ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.