- Telugu News » National » Those who consider the legal profession to be the profession of the wealthy cji
CJI: న్యాయవృత్తిని సంపన్నుల వృత్తిగా భావించేవాళ్లు.. సీజేఐ
న్యాయ వృత్తిని సంపన్నుల ప్రొఫెషనల్ వృత్తిగా భావించేవాళ్లు అని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవాళ ఆయన్ను సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జడ్జిల ఖాళీలు భారీ సంఖ్యలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కోర్టు ల్లోనూ మౌలికసదుపాయాలు సరిగా లేవని కూడా ఆయన అన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. అయితే సుప్రీంకోర్టులో ఇటీవలే 11 శాతం […]
Written By:
, Updated On : September 4, 2021 / 03:44 PM IST

న్యాయ వృత్తిని సంపన్నుల ప్రొఫెషనల్ వృత్తిగా భావించేవాళ్లు అని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవాళ ఆయన్ను సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జడ్జిల ఖాళీలు భారీ సంఖ్యలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కోర్టు ల్లోనూ మౌలికసదుపాయాలు సరిగా లేవని కూడా ఆయన అన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. అయితే సుప్రీంకోర్టులో ఇటీవలే 11 శాతం మహిళా ప్రాతినిద్యాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు.