
ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన అత్యయిక పరిస్థితి రోజులను ఎప్పటికీ మరచిపోలేమంటూ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను అణచి వేసిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగా సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. మన ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ అణచివేసింది. ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి, భారత ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడినవారంతా చిరస్మరణీయులు అంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు.