https://oktelugu.com/

రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి

దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రైలు ప్రయాణం చేశారు. దిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆయన స్వస్థలం కాన్పూర్ కు శుక్రవారం ఆయన రైలులో బయల్దేరారు. దిల్లీలోని సఫ్దార్జంగ్ రైల్వేస్టేషన్ లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక రైలు ఎక్కారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు పలికారు.

Written By: , Updated On : June 25, 2021 / 01:23 PM IST
Follow us on