
ఐపీఎల్ లో రెండో సీజన్ తొలి మ్యాచ్ లో ముంబై ప్రదర్శనపై ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తప్పుపట్టాడు. రోహిత్ శర్మ, హార్మిక్ పాండ్యా లేకుండానే ఈ మ్యాచ్ ముంబై ఆడింది. పవర్ ప్లే ముగిసే వరకు చెన్నై కీలక వికెట్లన్నీ కోల్పోయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది. అయితే, ఇందుకు ప్రధాన కారణం కెప్టెన్ కీరన్ పొలార్ట్ వ్యూహాలేనని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. పొలార్డ్ బౌలర్లు అందించిన ఆరంభన్ని చక్కగా వినియోగించుకోలేక తప్పిదాలు చేశాడని విమర్శించాడు.
ముంబై ఘనంగా మ్యాచ్ ఆరంభించింది. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబరించింది. రెగ్యూలర్ కెప్టెన్ దూరమైనప్పటికీ ఆ ఒత్తిడిని జయించి శుభారంభం చేసింది. పవర్ ప్లే ముగిసేసరికి సీఎస్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు రిటైర్డ్ హార్టగా వెనుదిరిగాడు. ఇలా కీలక వికెట్లు పడిన వేళ ఆ అవకాశాన్ని ముంబై చక్కగా ఉపయోగించుకోవాల్సింది. కానీ అడ్కడే ముంబై ఇండియన్స్ కెప్టెన్ ట్రిక్ మిస్సయ్యాడు. జస్ ప్రీత్ బుమ్రాతో 2 లేదా మూడు ఓవర్లు వేయించి ఉండాల్సింది.
అలా సీఎస్కే 5 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఉండేది. 60 లేదంటే 80 పరుగులకే ఆలౌట్ అయ్యిదే అని అన్నారు. ఆరు ఓవర్ల వరకు మిల్నే, బౌల్ట్ తో బౌలింగ్ చేయించిన పొలార్డ్.. ఆ తర్వాత ఓవర్ లో బుమ్రాను రంగంలోకి దించాడు. అయితే మళ్లీ 14వ ఓవర్ వరకు అతడికి బంతి ఇవ్వలేదు. దీంతో రుతురాజ్ నిలదొక్కుకుని తమ జట్టుకు మంచి స్కోరు అందించాడు.