
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎలువంటి ప్రభావం చూపదని కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, నీతీ ఆయోగ్ మెంబర్ వీకే పాల్ తెలిపారు. ఏ వేవ్ కూడా ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఆధారల్లేవని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన తెలిపారు. కరోనా కేసులు చిన్న పిల్లల్లో పెరుగుతుండంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ పిల్లలపై కరోనా వేవ్ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు అని ఆయన చెప్పారు.