
కొవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న ఆందోళన నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర కీలక సూచనలు చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పిల్లల కోసం సరిపడా పడకలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆక్సిజన్ సరఫరాలపై దృష్టి సారించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. రూ. 23,123 కోట్లతో ఇటీవల ప్రకటించిన భారత్ కొవిడ్ అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజ్ కింద చేసిన ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సమీక్షించింది.