
ఫరీద్ కోట్ దవాఖానకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నాసిరకం వెంటిలేటర్లను పంపారని పంజాబ్ ఆరోగ్య శాఖ చేసిన ఆరోపణలపై కేంద్రం గురువారం స్పందించింది. తాము పంపిన వెంటిలేటర్లలో చాలా యంత్రాలు మెరుగ్గా పనిచేసేవేనని, కేవలం కొన్ని వెంటిలేటర్లు లో మైనర్ రిపేర్లు అవసరమవుతాయని పేర్కొంది. ఫరీద్ కొట్ లోని జీజీఎస్ బోధనాసుపత్రికి పీఎం కేర్స్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం పంపిన వెంటిలేటర్లు పనిచేయడం లేదని వాటిని మూలనపడేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడయ్యాయి.