
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగడం లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం తర్వాత మన్మోహన్ కేబినెట్ లో చిరంజీవి చోటుదక్కించుకున్నారు. స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చిరు పాత్ర పెద్దగా కనపడటం లేదు. తాజాగా ఈ అంశంపై ఉమెన్ చాందీ క్లారిటీ ఇచ్చారు.