https://oktelugu.com/

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

మనస్పర్థల కారణంగా భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న సాయికుంట కాలనీలో నాగరాజు (39) స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన భార్య స్వరూప నిద్రిస్తున్న భర్తను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 3, 2021 / 11:19 AM IST
    Follow us on

    మనస్పర్థల కారణంగా భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న సాయికుంట కాలనీలో నాగరాజు (39) స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన భార్య స్వరూప నిద్రిస్తున్న భర్తను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.