
కరోనా రెండో ఉధృతి ముగిసిపోలేదని ప్రజలు అలసత్వంగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజువారీ కేసులు తగ్గుతున్నప్పటికీ జూన్ 23తో ప్రారంభమైన వారంలో 71 జిల్లాలో పాజిటివిటీ రేటు 10 శాతం పైగా నమోదైనట్లు గుర్తచేసింది. దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో సమస్యాత్మక జిల్లాలున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. వైరస్ తగ్గిపోయిందన్న ఉద్దేశంలో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని యూరప్ లో మళ్లీ కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించారు.