
కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లకు ప్రతినెలా ఆర్థిక సాయం అందాలని చూచించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. మే 16న 25.56 ఉన్న పాజిటివిటీ రేటు 13.02 కు తగ్గిందని తెలిపారు.