పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రధాన కార్యదర్శి హెచ్ కే ద్వివేదని సూచించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల్లో అధికారపక్షంతో పోలీసులతో రాజీపడ్డారని ఆరోపించారు. సంబంధిత ట్వీట్ ను మమతా బెనర్జీని […]
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రధాన కార్యదర్శి హెచ్ కే ద్వివేదని సూచించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల్లో అధికారపక్షంతో పోలీసులతో రాజీపడ్డారని ఆరోపించారు. సంబంధిత ట్వీట్ ను మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేశారు.