ఢిల్లీకి జగన్..రఘురామకు మూడిందా?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రసకందాయంలో పడింది. ఆయన పార్టీలో కొనసాగడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ చర్యలతో పార్టీ అప్రతిష్ట మూటగట్టుకుంది. దీంతో రఘురామ పశ్చాత్తాప పడినా లాభం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్న సందర్భంలో రఘురామ భవితవ్యం తేలనుందని తెలుస్తోంది. రఘురామ కృష్ణంరాజు టీడీపీ ఆదేశానుసారం పనిచేస్తన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతల ప్రభావం […]

Written By: Srinivas, Updated On : June 6, 2021 7:04 pm
Follow us on

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రసకందాయంలో పడింది. ఆయన పార్టీలో కొనసాగడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ చర్యలతో పార్టీ అప్రతిష్ట మూటగట్టుకుంది. దీంతో రఘురామ పశ్చాత్తాప పడినా లాభం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్న సందర్భంలో రఘురామ భవితవ్యం తేలనుందని తెలుస్తోంది.

రఘురామ కృష్ణంరాజు టీడీపీ ఆదేశానుసారం పనిచేస్తన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతల ప్రభావం ఉందని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రఘురామను తమపై ప్రయోగించించిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు రఘురామ అనుసరిస్తున్న వైఖరి కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉందని నేతల అభిప్రాయం. వైసీపీకి వ్యతిరేకంగా ఆయనను పురిగొల్పడానికి టీడీపీ నేతు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు మాయలో పడిన రఘురామ తరువాత తన తప్పును తెలుసుకున్నప్పటికి ఉపయోగం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. ఆయన వాస్తవ పరిస్థితులను గ్రహించుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో శరీరంపై వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా పరిస్థితి అర్థమైపోతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలనే జగన్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి మాత్రం ఎప్పుడు దీనికి భిన్నంగా ఉంటుంది. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడు దొంగ చూపేనని విజయసాయిరెడ్డి విమర్శించారు. లిటిగేషన్లతో ప్రభుత్వాన్ని దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తుంటారని ఎద్దేవా చేశారు