
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72838 టెస్టులు చేయగా దాదాపు 7వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,46,530కు పెరిగాయి.ఇక శనివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 45గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5506కు పెరిగింది.