
పోలీసుల త్యాగాలు మరువలేనివి అని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఐపీఎస్ లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. వారికి పలు సూచనలు చేశారు. దేశ రక్షణలో ఎంతో మంతి పోలీసు సిబ్బంది ప్రాణాలు అర్పించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పోలీసులపై ఉన్న వ్యతిరేక దృక్పథాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్ లపై ఉందన్నారు.