
పొగ తాగేవారిలో కరోనా వల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. అలాగే క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, కరోనా వల్ల తలెత్తే శ్వాస సంబంధిత సమస్యలు కూడా సోకే ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడించారు. పొగాకు నివారణలో భాగంగా డబ్ల్యూహెచ్ వో నిర్వహిస్తున్న కమిట్ టు క్విట్ అవగాహన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.