
ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి గల కారణాలను గుర్తించి వెంటనే ఇంటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉది అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈరోజు జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేేరి, పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఆయా రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు పార్టీకి వివరించాలని సోనియా ఆదేశించారు.