
వరుస వివాదాస్పద ప్రకటనలతో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వార్తల్లో నిలుస్తున్నారు. మహిళల వస్త్రాధరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా తాలిబన్లకు వంతపాడారు. తాలిబన్లు సాధారణ పౌరులేనని.. వారు సైన్యం దుస్తుల్లో ఉన్న ముఠా కాదని అన్నారు. తాలిబన్ వర్గానికే చెందిన దాదాపు 30 లక్షల మంది అఫ్గానీయులు పాక్ సరిహద్దుల్లో ఉండగా వారిని ఎలా బంధిస్తామని ప్రశ్నించారు. పాకిస్థాన్ లో ఉన్న అఫ్గాన్ శరణార్థుల్లో మెజారిటీ ప్రజలు పష్తూన్ వర్గానికి చెందిన వారే ఉన్నారని అమెరికా మీడియా సంస్థ పీఎస్బీ ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.