
హాంగ్ కాంగ్, షిన్ జియాంగ్ ప్రాంతాలలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచ దేశాలు చైనాపై విరుచుకుపడ్డాయి. సెప్టెంబర్ 7నుండి అక్టోబర్ 14వరకు జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమితి మానవ హక్కుల మండలి సమావేశం దీనికి వేదికైంది. హాంగ్ కాంగ్, టిబెట్, షిన్ జియాన్, ప్రాంతాలలో ప్రజలు, జర్నలిస్టులు, విమర్శకులు,లాయర్లు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని 50మందితో కూడిన ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం వెల్లడించింది. అంతేకాకుండా ఇంటర్నెట్ పై ఆంక్షలు, డిజిటల్ నిఘా వంటి చర్యలకు పాల్పడుతుందని ‘హుమన్ రైట్స్ వాచ్ ” సంస్థ తెలిపింది.
Also Read: పీపీఈ కిట్లను నిల్వచేయడానికి స్థలాలు లేవు