
కన్న కొడుకునే బావిలో నెట్టేసి తల్లి చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్ పురకు చెందిన బన్ని (14) అనే బాలుడిని తన తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేయడంతో చనిపోయాడు. ప్రస్తుతం శ్యామల పోలీసుల అదుపులో ఉంది. బన్ని మానసిక స్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.