Harsh Goenka: దేశలో జవాబుదారీతనం లేకుండా పోయిందని పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ స్టేషన్ వద్ద, కుంభమేళాలో, బెంగళూరు తొక్కిసలాటలో డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. అయినా ఎవరూ రాజీనామా చేయలేదు. జవాబుదారీతనం లేదు. పాఠాలు నేర్చుకోలేదు. మన దేశంలో సామాన్యుడి జీవితానికి విలువ లేదు. కప్పు చాయ్ కంటే చౌక. అంత యథావిధిగా మారిపోతుంది. ఏమీ మారదు అని ఆయన ఆవేదనాభరిత ట్వీట్ చేశారు.