
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ఫైలట్ ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది. విడతల వారీగా దళిత బంధు పథకం ఫైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుద చేసిన నిధులతో కలిపి ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తంగా రూ. 2వేల కోట్లు విడుదల చేసినట్లు అయింది.