
ఢిల్లీ జూలో ఓ ఏడేండ్ల మగ సింహం గుండె ఆగి మరణించింది. మార్చి మొదటి వారం నుంచి అనారోగ్యంతో ఉన్న సింహాన్ని పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 13న జూలో ని వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చారు. దానిలో క్రానిక్ బ్రాంకైటిస్, సైకలాజికల్ అబ్నార్మాలిటీస్, కాంప్లెక్సిటీస్ ఇన్ మల్టిపుల్ ఆర్గాన్స్ తో పాటు వివిధ రకాల ఇన్ ఫెక్టన్ లు ఉన్నట్లు గుర్తించారు. పలు ఆస్పత్రుల నుంచి నిపుణులైన వైద్యులు వచ్చి దానికి చికిత్స అందించారు. అయినా అమన్ కోలుకోలేదు. పరిస్థితి విషమించడంతో గుండెపోటు వచ్చి ఈ ఉదయం మరణించింది. వెటర్నరీ డాక్టర్ల బృందం ఆ సింహం కళేబరానికి పోస్ట్ మార్టం నిర్వహించింది.